# Tags
#Blog

విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి, జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

👁 1 Views

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు, విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్, డిఎస్పీ లు పురుషోత్తం రెడ్డి, రవికుమార్, ఇన్స్పెక్టర్లు వేణు, ఆరిఫ్ అలీ ఖాన్, కరుణాకర్, శ్రీనివాస్, శ్రీధర్,SI లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *