మండలి వెంకటకృష్ణ రావు స్మారకంగా ప్రపంచ స్థాయి కథల పోటీల విజేత రచయిత్రి నామన సుజనా దేవి “కళ్ల చాటు కావ్యం” కథకి బహుమతి
హైదరాబాద్ :
మండలి బుద్ధ ప్రసాద్ ఆయన తండ్రి మండలి వెంకటకృష్ణ రావు స్మారకంగా ప్రపంచ స్థాయి కథల పోటీలను ఉషా పత్రిక ద్వారా నిర్వహించారు.

ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ఆర్ మూర్తి ఆడిటోరియంలో బహుమతులను అందజేశారు.
అక్టోబర్ మూడు, నాలుగు తేదీలలో రెండు రోజులు జరిగిన తెలుగు పరిరక్షణ సదస్సు మరియు బహుమతుల ప్రధానోత్సవంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సభలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్
మరియు పొలిట్ బ్యూరో సభ్యులు
జేడీ జనార్ధన్ , ఆంధ్ర సారస్వతం పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ అతిథులుగా హాజరయ్యారు.

కన్నుల పండుగగా రెండు రోజులు జరిగిన ఈ ఉత్సవంలో శరత్చంద్ర తెలుగు సంస్కృతిక అకాడమీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ మరియు విశాఖపట్నం అయిన శరత్చంద్ర అలియాస్ ఆర్ డి విల్సన్ ఉషా పత్రిక ద్వారా నిర్వహించిన కథల పోటీలో బహుమతులు పొందిన వారికి బహుమతులను అతిధుల చేతుల మీదుగా ప్రధానం చేశారు.

ఇందులో కరీంనగర్ కు చెందిన రచయిత్రి నామన సుజనా దేవి కి ప్రపంచ స్థాయి కథల పోటీలో “కళ్ల చాటు కావ్యం” కథకి బహుమతిని మండలి బుద్ధ ప్రసాద్ ద్వారా స్వీకరించారు.
మరియు పోలేపల్లి సిద్దయ్య స్మారక కథల పోటీలో కూడా బహుమతిని గెలుపొంది ఆ బహుమతిని కూడా స్వీకరించారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





