నర్సింగాపూర్‌లో ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించిన ఎలక్టోరోల్ అబ్జర్వర్, జిల్లా కలెక్టర్
జగిత్యాల :
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

మంగళవారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించి ఇ – రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి ప్రత్యక్షంగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. బీఎల్‌ఓలను ప్రత్యక్షంగా కలిసి, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, ఓటర్ల వివరాల పరిశీలన, ఇంటింటి సర్వే, ఫారాల స్వీకరణ, ఓటర్ల నుంచి సేకరించిన వివరాలు తదితర అంశాలపై పూర్తిస్థాయి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

అలాగే బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఓటర్ల వివరాల వెరిఫికేషన్ ప్రక్రియ, పెండింగ్‌లో ఉన్న అంశాలు తదితర విషయాలపై అబ్జర్వర్ ఆరా తీశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ ఓటర్లకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఇ – రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను, ఉద్యోగులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మండల తహసీల్దార్ హకీమ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





