రాష్ట్రస్థాయిబాల – బాలికల కబడ్డీ క్రీడోత్సవాల్లోవిజేతలకు బహుమతులు ప్రధానంచేసిన మంత్రిపొన్నంప్రభాకర్, ప్రభుత్వవిప్ ఆదిశ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఫైనల్ మ్యాచ్ వీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
ఫైనల్ బాలికల మ్యాచ్ లో కొత్తగూడెం జిల్లా బాలికల జట్టు ఖమ్మం జిల్లా జట్టు పై విజయం సాధించింది..

ఫైనల్ బాలుర మ్యాచ్ లో వనపర్తి జిల్లా పై నల్గొండ జిల్లా జట్టు విజయం సాధించింది..
క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , మంత్రి పొన్నం ప్రభాకర్
వేములవాడ నియోజకవర్గ కేంద్రం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిర్వహించిన ఈ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి. ఎంతో ఉత్సాహంగా, క్రీడా స్ఫూర్తితో ఈ పోటీలు కొనసాగడం అభినందనీయం.
ఈరోజు జరిగిన ఫైనల్స్‌లో బాలికల విభాగంలో కొత్తగూడెం జట్టు, ఖమ్మం జట్టుపై విజయం సాధించగా, బాలుర విభాగంలో నల్గొండ జట్టు, వనపర్తి జట్టుపై విజయం సాధించి విజేతలుగా నిలిచాయి.
విజేతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. గెలవలేకపోయిన క్రీడాకారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఓటమిని ఒక అనుభవంగా తీసుకుని మరింత పట్టుదలతో సాధన చేసి భవిష్యత్ పోటీల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణను క్రీడల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది.
రాబోయే ఒలింపిక్స్‌లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన చేయాలంటే తెలంగాణకు చెందిన క్రీడాకారులు కూడా పెద్ద సంఖ్యలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.
ఇందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాం.
అలాగే సీఎం కప్ ద్వారా గ్రామ గ్రామాన క్రీడా పోటీలను నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీస్తున్నాం. ఇప్పటికే ఉన్న క్రీడా మైదానాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు అవసరమైన చోట కొత్త మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం.
క్రీడాకారులను ప్రోత్సహించడమే కాకుండా వారికి మెరుగైన శిక్షణ, సరైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలతో పాటు క్రీడాకారుల రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక కూడా జరగడం అభినందనీయం.
ఈరోజు మన పిల్లలు సెల్ఫోన్లో స్క్రీన్ గేమ్స్‌కు పరిమితం కాకుండా గ్రౌండ్లో క్రీడలు ఆడాలి. ఆరోగ్యంగా ఉండాలి. సమయాన్ని వృథా చేసే అలవాట్లకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చిన్నప్పటి నుంచే క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరుతున్నాను. క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను కూడా పెంపొందిస్తాయి.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లు, టీమ్ మేనేజర్లు, నిర్వాహకులు, క్రీడాభిమానులందరికీ నా ప్రత్యేక అభినందనలు.
వేములవాడలో నిర్వహించిన ఈ కబడ్డీ పోటీలు ప్రతి క్రీడాకారుడికి చిరస్థాయిగా గుర్తుండిపోయేలా నిర్వహించినందుకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి శుభాకాంక్షలు. విజేతలకు మరోసారి హృదయపూర్వక అభినందనలు.
ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరింత కష్టపడి, పట్టుదలతో సాధన చేసి రాబోయే పోటీల్లో విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను.
క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.




