రైతులు, నిర్వాసితులకు పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల :
భూసేకరణ పనులను వేగవంతం చేయాలి
జిల్లాలో కొనసాగుతున్న అన్ని భూసేకరణ ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనుల పురోగతి, పరిహారం చెల్లింపులు, భూసేకరణకు సంబంధించిన ఫైళ్ల స్థితిగతులను కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులన్నింటినీ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు, నిర్వాసితులకు చట్టబద్ధంగా అందాల్సిన పరిహారాన్ని త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
భూసేకరణకు సంబంధించిన ఫైళ్లను రోజువారీగా పరిశీలిస్తూ, పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వాటిని పరిష్కరించాలని తెలిపారు. ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణ పనులు ఆటంకంగా మారకుండా నిర్దేశిత కాలవ్యవధిలో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆర్డీవోలు, ఇరిగేషన్ ఇంజనీర్లు, తహశీల్దార్లు, ల్యాండ్ అక్విజిషన్ (ఎల్‌ఏ) యూనిట్ అధికారులు తమ పరిధిలోని భూసేకరణ పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు. పెండింగ్ ఫైళ్లను ప్రత్యేకంగా గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో పాటు, రైతులు, నిర్వాసితులకు రావాల్సిన పరిహారం సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష లో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పెల్లి ఆర్డీవోలు మధు సూదన్, జీవాకర్ రెడ్డి, నరసింహ రావు, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





