# Tags
#Candidates #Events #People #politics

ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన..

👁 21 Views

జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు.

మూడేళ్లుగా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, కళాశాల భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వసతి గృహం లేక ఇబ్బందులు పడుతున్నామనీ,., రేకుల షెడ్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణ చేశారు.

కనీసం ల్యాబ్‌ సౌకర్యాలు కూడా సరిగా లేవని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సౌకర్యాల లేమితో వైద్య విద్యపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు ఈసందర్బంగా హెచ్చరించిచి, ర్యాలీ చేపట్టారు.