# Tags
#Analytics #Blog #Events #People #జగిత్యాల

జగిత్యాల కలెక్టర్‌ బి.సత్యప్రసాద్, (ఐఏఎస్) తో ఇండియన్ రెడ్ ‌క్రాస్ సొసైటీ నూతన కమిటీ భేటీ..

👁 37 Views

జగిత్యాల: 

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, (ఐఏఎస్) ‌ను మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కలెక్టర్‌ సత్యప్రసాద్ ను ఎన్నికల అధికారి,  జిల్లా సహకార అధికారి సి హెచ్ మనోజ్ కుమార్ తో కలిసి తమ ఎన్నిక వివరాలను తెలియజేసి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టే సేవా కార్యక్రమాలపై చర్చించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ సత్యప్రసాద్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.

అనంతరం, జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.