# Tags
#Blog

ఉత్తమ మహిళా రైతు బండారి విజయా వెంకటేష్ ను సన్మానించిన జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్

👁 5 Views

సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన బండారి విజయావెంకటేష్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే ఉత్తమ మహిళా రైతు దివస్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్బంగా బుధవారం పెంబట్ల గ్రామ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బండారి విజయావెంకటేష్ ను జగిత్యాల జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ….

👉 కేంద్ర స్థాయిలో అవార్డు తీసుకున్న బండారి విజయ వెంకటేష్ గారి కు శుభాకాంక్షలు చెపుతూ, పెంబట్ల అనే చిన్న గ్రామాన్ని దేశస్థాయిలో నిలిపినటువంటి ఘనత బండారి విజయ వెంకటేష్ కష్టానికి చెందుతుందని అన్నారు.
👉 భూమిని నమ్ముకుని వివిధ రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తూ, వాణిజ్యపరంగా ముందుకు వెళ్తున్న వీరికి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అందించాలని అన్నారు.
👉 రైతేడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు లేదని, రైతుకు కావలసిన మౌలిక సదుపాయాలు నీళ్లు, కరెంటు విత్తనాలు ఎరువులు సకాలంలో అందిస్తే రైతు పంట పండించగలుగుతాడని అన్నారు.
👉 ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉందని అదే కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు అందించారని గుర్తు చేశారు.
👉 ప్రభుత్వాలు, పాలకులు మారినా, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు.
👉 పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ఘనత కేసిఆర్ ది అని అన్నారు.
👉 గత ప్రభుత్వంలో ఏ విధంగా యూరియా షాపుల్లో ఇచ్చిండ్రో అదే విధంగా ఇవ్వాలని ఈ ఆప్ లు పెట్టి రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు.
👉 కెసిఆర్ దూర దృష్టి తోటి దేశమంతా కరువచ్చినా కూడా తెలంగాణకు కరువు రావద్దని ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని అన్నారు.
👉 కెసిఆర్ మీద కోపంతో రైతులకు ద్రోహం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
👉 ఎల్నినో ప్రభావంతో రైతులకు పంటలు వేయొద్దని చెప్తున్నారు మరి రైతులు రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు…?
👉 ప్రతి రైతుకు ఎకరానికి 25000 చొప్పున ఆర్థిక సహాయం చేసి సన్న , చిన్నకారు రైతులను ఆదుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు తేలు రాజు సర్పంచ్ లు రమేష్ రామ భాస్కర్ మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు బాదినేని రవి శేఖర్ మున్నూరు కాపు మండల అధ్యక్షుడు బాదినేని వెంకటేష్ తేలు లక్ష్మీ రాజం వార్డ్ సభ్యులు తేలు విజయ,చుక్క దుబ్బన్న మహేష్ తేలు వంశీ నరేష్ అత్తెనినే నరేష్ ఒడ్నాల రాజేశం మల్లయ్య మున్నూరు కాపు కుల బాంధవులు నాయకులు తదితరులు ఉన్నారు.

ఉత్తమ మహిళా రైతు బండారి విజయా వెంకటేష్ ను సన్మానించిన  జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్