# Tags
#Events #politics #జగిత్యాల #తెలంగాణ

రైతుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందన.. రోల్లవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి చివరి ఆయకట్టుకు నీటి విడుదల

👁 10 Views

జగిత్యాల :

వరి పంటకు చివరి తడి అందించేందుకు చర్యలు తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

బీర్పూర్ మండలంలోని రోల్లవాగు ప్రాజెక్టు గేట్లను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎత్తి వరి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు.

బీర్పూర్ మండలంలోని చివరి ఆయకట్టు రైతుల వరి పంటలకు చివరి తడి నీరు అందించాలని మండల నాయకులు, రైతులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కోరారు.

రైతుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి చివరి ఆయకట్టు వరకు వరి పంటలకు చివరి తడి నీరు అందించాలని ఆదేశించారు.

ఈ సందర్బంగా, రోల్లవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు.

రైతుల ఇబ్బందులను గుర్తించి, వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి పంటలకు చివరి తడి నీరు అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు బీర్పూర్ మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రాంచందర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ కొల్వాయి నవీన్ రావు,బీర్ పూర్ గ్రామ సర్పంచ్ హరీష్, ఉప సర్పంచ్ ఏనుగంటి జితేందర్,కృష్ణ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అర్షకోట రాజుగోపాల్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపాక రమేష్, ఇరిగేషన్ అధికారులు, మండల సర్పంచులు, మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.