# Tags
#Events #politics #జగిత్యాల #తెలంగాణ

చర్లపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

👁 11 Views

జగిత్యాల :

గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు శ్రీకారం చుట్టారు.

జిల్లాలోనేమొట్టమొదటిసారిగారూ.3.50 రూ. లక్షల నిధులతో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం, 25 లక్షల రూ.నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పంచాయతీ ఆవరణలో మొక్కను నాటారు.

గ్రామంలో రూ.5 లక్షల చొప్పున నిర్మించనున్న మున్నూరుకాపు, రెడ్డి కుల సంఘ భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

10 లక్షల రూ. తో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.

అనంతరం, గ్రామానికి చెందిన దీటి లావణ్య–రాజయ్య,
గడ్డం అంజయ్య ఈశ్వరి దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

👉ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లాలో మొదటి మ్యాజిక్ డ్రైన్ కు శంకుస్థాపన చేయటం ఆనందదాయకం…

👉గ్రామాల్లో నిత్య పారిశుధ్యంతో ఆరోగ్య వాతావరణం.

👉గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం కృషి చేస్తున్నాం…

👉ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తో పేదల కళ్లలో ఆనందం..

👉మహిళ సంఘ భవనాల నిర్మాణానికి అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు..

👉తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారికత కోసం కృషి చేస్తుంది.

👉మ్యాజిక్ డ్రైన్ నిర్మాణంతో గ్రామాల్లో కొత్తదనానికి నాంది అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనందరెడ్డి, amc చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య, ఎంపిడిఓ రమాదేవి, తహసీల్దార్ హకీమ్, ఎంపిఓ రవిబాబు, de మిలింద్ జిల్లా మండల సర్పంచుల ఫోరం బొలిశెట్టి గంగారెడ్డి కట్ట రాజేందర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల ముకుందం ae విజయ్ మాజీ సర్పంచ్ తిరుపతి ఉపసర్పంచ్ దుమాల సుమన్, వార్డు సభ్యులు ఇమ్మడి విజయ్, బలుసాని విజయ, బలుసాని స్వరూప, కోల రాజిరెడ్డి, బొమ్మెన రాజేందర్, కార్యదర్శి apm లక్ష్మణ్ మహేష్,డా.అమిత్ డా.విజయ్ రెడ్డి సర్పంచులు రాజేందర్ నక్క హరీష్ బొడ్డు దామోదర్ మల్లారెడ్డి జగిత్యాల యూత్ అసెంబ్లీ భూమా రెడ్డి నలువాల సురేష్ మహిపాల్ విజయ్ సుమన్ శ్రీకాంత్ తిరుపతి, గ్రామ మండల నాయకులు అధికారులు మహిళలు కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.