# Tags
#Events #ఎడ్యుకేషన్ & కెరీర్ #జగిత్యాల #తెలంగాణ

వియత్నాం సందర్శించిన ఉపాధ్యాయినిలను అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

👁 22 Views

జగిత్యాల :


ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ ద్వారా ఎడ్యుకేషనల్ టూర్ ఈనెల 11 నుండి 17 వరకు కి వియత్నాం వెళ్లి వచ్చిన ఉపాధ్యాయనిలను జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్ లో పనిచేస్తున్న శ్రీమతి గంప విద్యా దేవి మరియు ఎం పీ పీ ఎస్ ఇంద్రానగర్ మెట్ పెల్లి లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి వేముల శ్రీలతల ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు.


ఈ సందర్బంగా కలెక్టర్ సత్యప్రసాద్ వారితో మాట్లాడుతూ…. వియత్నం లో విద్యా సంస్థల సందర్శన ద్వారా తెలుసుకున్న విషయాలను మన జిల్లా లో కూడా అమలు చేయాలని, తద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అవకాశం ఉంటుందని వారన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని పెల్లి ఆనంద్ రావు పాల్గొన్నారు.