# Tags
#politics #జగిత్యాల #తెలంగాణ #హైదరాబాద్

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతిలక్ష్మణ్ : నియామక పత్రం అందజేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ

👁 1 Views

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా: జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల:

జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగిత్యాల పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నియామక నేడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

జగిత్యాల జిల్లాలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళలను రాజకీయంగా చైతన్యవంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువాడి నరసింగరావు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.