# Tags
#Candidates #Europe #People #జగిత్యాల #తెలంగాణ

భారత సైన్యంలో చేరాలనుకున్న గల్ఫ్ కార్మికుడైన తన కొడుకు కలను నెరవేర్చండని తల్లి వేడుకోలు

👁 15 Views

హైదరాబాద్ : (జగిత్యాల జిల్లా):

★ నవంబర్ 16న హైదరాబాద్‌లో అగ్నివీర్ ఫిజికల్ టెస్ట్ కు హాజరయ్యేందుకు అబుదాబి నుంచి రప్పించాలని తల్లి వేడుకోలు

★ విదేశీ యాజమాన్యం నుంచి రెండు వారాల అత్యవసర సెలవు ఇప్పించేందుకు ప్రభుత్వ చొరవ

భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న తన కుమారుడు కోపర్తి అభిలాష్ కలను నెరవేర్చేందుకు అతన్ని అబుదాబి నుంచి రెండు వారాల సెలవుపై ఇండియాకు తెప్పించాలని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన సుమలత ముఖ్యమంత్రి, ఎన్నారై మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

అభిలాష్ ప్రస్తుతం యూఏఈ రాజధాని అబుదాబిలో ఆల్ఫామెడీ సంస్థలో పనిచేస్తున్నారు. భారత సైన్యం నిర్వహిస్తున్న అగ్నివీర్ నియామక ప్రక్రియలో నవంబర్ 16న హైదరాబాద్‌లో జరగనున్న శారీరక దేహదారుఢ్య పరీక్షకు ఆయన హాజరు కావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో నవంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించిన 266వ రాష్ట్రస్థాయి సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సుమలత, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి
వినతిపత్రం సమర్పించారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ

ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవంబర్ 4న జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీంతో ఫోన్‌లో మాట్లాడారు. అభిలాష్‌ను స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. దీంతో జీఏడీ ఎన్నారై విభాగం అధికారులు అబుదాబిలోని ఇండియన్ ఎంబసీకి లేఖ రాశారు. అభిలాష్‌కు రెండు వారాల అత్యవసర సెలవు మంజూరు చేసే విషయమై యజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇండియన్ ఎంబసీ, తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

భారత సైన్యంలో చేరాలనుకున్న గల్ఫ్ కార్మికుడైన తన కొడుకు కలను నెరవేర్చండని తల్లి వేడుకోలు

పంచాంగము 11.11.2026