# Tags
#Events #People #politics #జగిత్యాల #తెలంగాణ

కోటిలింగాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

👁 31 Views

తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం-2007 పుస్తకం మరియు బోర్డుల ఆవిష్కరణ

కోటిలింగాల పుణ్యక్షేత్రం వద్ద అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని
ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007, నిబంధనలు 2011, జి.వో 40కి సంబంధించిన పుస్తకాన్ని, మరియు పోలీస్ స్టేషన్లలో ప్రదర్శించాల్సిన ఈ చట్టానికి సంబంధించిన బోర్డులను కూడా ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ఆర్.డి.ఓ మధుసూధన్, సంక్షేమ అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/FiwC23wJ_8c

వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు:

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా, ఈ వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

వృద్ధులను గౌరవించడం, వారిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు గుర్తుచేశారు. ఈ చట్టాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

కోటిలింగాల పుణ్యక్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు

తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం-2007 పుస్తకం మరియు బోర్డుల ఆవిష్కరణ

కోటిలింగాల పుణ్యక్షేత్రం వద్ద అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని
ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007, నిబంధనలు 2011, జి.వో 40కి సంబంధించిన పుస్తకాన్ని, మరియు పోలీస్ స్టేషన్లలో ప్రదర్శించాల్సిన ఈ చట్టానికి సంబంధించిన బోర్డులను కూడా ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ఆర్.డి.ఓ మధుసూధన్, సంక్షేమ అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు:

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా, ఈ వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

వృద్ధులను గౌరవించడం, వారిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు గుర్తుచేశారు. ఈ చట్టాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *