# Tags
#Blog

అక్షర సేవలో ‘అభయ హస్తం’

👁 33 Views

👉113 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ

👉పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపిన రిటైర్డ్ అధ్యాపకులు రాజేశ్వర్ సార్

జగిత్యాల :

పాఠశాలల వికాసానికి, పేద విద్యార్థుల అభ్యున్నతికి దాతల సహాయ సహకారాలు ఎంతో అభినందనీయమని బీర్ పూర్ మండల విద్యాశాఖ మరియు ఉపాధ్యాయ లోకం కొనియాడింది.

బీర్ పూర్ మండలంలోని మంగేల ఎంపీ యూపీఎస్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వ రిటైర్డ్ అధ్యాపకులు , విద్యావేత్త అర్వపల్లి రాజేశ్వర్ సార్ తన సొంత ఖర్చులతో 113 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.

అధ్యాపక వృత్తి నుంచి నిష్క్రమించినప్పటికీ విద్యార్థుల పట్ల తనకున్న ప్రేమను, సేవా భావాన్ని రాజేశ్వర్ సార్ మరోసారి చాటుకున్నారు.

ఒకప్పుడు అధ్యాపకుడిగా ఎంతో మందిని తీర్చిదిద్దిన ఆయన, నేడు విద్యార్థులకు అవసరమైన పాఠశాల బ్యాగులను అందించి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపడం పట్ల మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

రాజేశ్వర్ సార్ చేసిన ఈ ఉదార కార్యక్రమం సమాజంలోని ఇతర దాతలకు, పూర్వ విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని సభలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు.

ఆయన సేవలను ఆదర్శంగా తీసుకుని మరికొందరు దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి. ముజకిర్ పాషా, మంగేల గ్రామ సర్పంచ్ బనక సతీష్, ఉప సర్పంచ్ దగ్గుల వీరేశం, ఎస్ఎంసి ఛైర్మన్ సాయినవేణి పద్మ, వార్డ్ మెంబర్ పసే రాజేశ్వరి, కండ్లపల్లి హెచ్‌ఎం వేణుగోపాల్, టి.ఆర్.టి.ఎఫ్ మండల అధ్యక్షులు నరేడ్ల భూమారెడ్డి, గొలనూ మధుసూధన్, గ్రామ కార్యదర్శి అజ్మీర వినోద్, ఉపాధ్యాయులు ఎర్రోళ్ల శాస్త్రి, సంతోష్ కుమార్, జమున, జితేందర్, గ్రామ ప్రజలు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని దాత ఎ. రాజేశ్వర్ సార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *