# Tags
#Blog

జగిత్యాల సీనియర్ న్యాయవాదికి అరుదైన గౌరవం.. చెన్నైలో గౌరవ డాక్టరేట్ ప్రదానం….

👁 13 Views

జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది మామిడాల పాండు రంగ విఠల్‌ కు అరుదైన గౌరవం దక్కింది.న్యాయవాద వృత్తిలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించడంతో పాటు పలు సేవా ట్రస్టుల ద్వారా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనను అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ వరించింది. చెన్నైలోని కృష్ణ గానసభ ఆడిటోరియంలో నిర్వహించిన సోషల్ లీడర్స్ ,విజనారీస్ కాంక్లేవ్ 2026 కార్యక్రమంలో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ కె. వెంకటేశన్ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.సమాజానికి,న్యాయ రంగానికి పాండురంగ విఠల్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.కాగా,సీనియర్ న్యాయవాదికి డాక్టరేట్ లభించడం పట్ల జగిత్యాల పట్టణ ప్రముఖులు,న్యాయవాదులు పలు సేవా సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *