# Tags
#Blog

నిరుపేద విద్యార్థి ఎంబిబిఎస్ చదవడానికి అండగా నిలిచిన ఎస్పీఎఫ్ ట్రస్ట్….25 వేల రూపాయల ఆర్థిక సహకారం అందించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రసూనాంబ….

👁 11 Views

జగిత్యాల పట్టణానికి చెందిన భోగ విష్ణువర్ధన్ అనే విద్యార్థికి ఇటీవల వెలువడిన నీట్ ఫలితాలలో ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబిబిఎస్ సీట్ వచ్చింది. కానీ నిరుపేద కుటుంబం, తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేయడం, వైద్య విద్య చదవడానికి డబ్బులు లేక నిస్సహాయ స్థితి నెలకొన్నది.
ఇట్టి విషయము గత కొన్ని రోజుల క్రితం డాక్టర్ సీటు వచ్చింది… పేదరికం అడ్డొచ్చింది… ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థి… అనే శీర్షికతో పలు వార్తాపత్రికల్లో కథనాలు రావడం జరిగింది. ఇట్టి వార్త కథనాలు తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ ఐఏఎస్ గారి దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన శ్యామ్ ప్రసాద్ లాల్ గారు తను మరియు తన మిత్ర బృందం తో నడుస్తున్న శ్యామ్ ప్రసాద్ లాల్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్( ఎస్పీఎఫ్ ట్రస్ట్ ) ద్వారా సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి,వివరాలను కనుగొనడం జరిగింది. ఈ మేరకు శుక్రవారం రోజున ఎస్పీఎఫ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ గోనె శ్రీనివాస్ మరియు ట్రస్ట్ బాధ్యులు, జగిత్యాల జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గుగ్గిళ్ళ సత్యం, బట్టు హరికృష్ణ తదితరులు జగిత్యాల కి వెళ్లి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి ప్రసూనాంబ గారి చేతుల మీదుగా అట్టి నిరుపేద విద్యార్థి భోగ విష్ణువర్ధన్ ఎంబిబిఎస్ చదవడానికి 25వేల రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి ప్రసూనాంబ గారు మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించి, మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *