# Tags
#Blog

పరిహారం అందించకపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. తమకు న్యాయం చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

👁 16 Views

జగిత్యాల పట్టణంలోని లింగంపేట రైల్వే స్టేషన్‌కు భూములు తీసుకున్న రైతులు జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన చేశారు.. అయితే 30 ఏళ్ల క్రితం 100 ఎకరాల వరకు భూములు తీసుకోగా అప్పుడు గుంటకు అయిదు వేల చొప్పన పరిహారం ఇచ్చారు.. అది చాలదని రైతులు కోర్టును ఆశ్రయించారు.. కోర్టు పరిహారం పెంచాలని ఆదేశాలు జారీ చేసినప్పటికి పరిహారం చెల్లించటంలేదు.. దీంతో ఈ రోజు కోర్టు అధికారులు కార్యాలయంలోని సామాగ్రిని జప్తు చేసేందుకు వచ్చారు… అయితే కార్యాలయంలో ఏలాంటి సామాగ్రి అందుబాటులో లేక పోవటంతో కోర్టు అధికారులు వెను తిరిగి పోయారు… సమాచారం అందుకున్న రైతులు తమకు పరిహారం అందించి న్యాయం చేయాలని ఆందోళన చేశారు.. పరిహారం అందించకపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. తమకు న్యాయం చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు….

Btntht

Leave a comment

Your email address will not be published. Required fields are marked *