# Tags
#Blog

Medical camp at Shivagayatri Old Age Home under the aegis of the Indian Red Cross Society

👁 69 Views

జగిత్యాల :

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ రాజ రాజేశ్వరస్వామి గుట్ట ప్రక్కనున్న శివగాయత్రి వృద్దాశ్రమంలో గురువారం వైద్య శిభిరం జరిగింది.  

ప్రపంచ వృద్దాప్య దినోత్సవం సందర్బంగా నిర్వహించిన ఈ వైద్య శిభిరంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు శ్రీమతి భీమానాతిని ఉమాదేవి, సభ్యులు చిత్తారి మధుకర్,  సిరిపురం శ్రీనివాస్ , గుండా సురేష్, ఆశ్రమం నిర్వాహక సభ్యులు గిరి నాగభూషణం, కాలగిరి బాపురెడ్డి, కప్పల చంద్రమౌళి, రంగు రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. 

డా. శ్రీనివాస్ రెడ్డితోపాటుగా డా.  రాజశేఖర్,  డా శ్రవణ్ కుమార్, డా. రఘురామ్  లు ఆశ్రమంలోని వృద్ధులకు ఈ సి జి, బి పి, షుగర్, క్రియాటిన్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, పండ్లు అందజేశారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, వృద్దాప్యంలో ఆశ్రమంలో ఉన్న వారిని గౌరవిస్తూ, సమాజంలో అందరికీ అందే సౌకర్యాలు,  వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రపంచ వృద్దాప్య దినోత్సవం సందర్బంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, పండ్లు అందజేశామన్నారు. 

ఉమ్మడి కుటుంబాలకు దూరమౌతూ,  నూక్లియర్ వ్యవస్థలో మనుగడ సాధిస్తున్నందునే వృద్ధఆశ్రమాలు పెరిగిపోతున్నాయన్నారు.

ప్రపంచ వృద్దాప్య దినోత్సవం గురించి వివరిస్తూ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1990 డిసెంబర్ 14న అక్టోబర్ 1వ తేదీని అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవంగా ప్రకటించి…. 1991 అక్టోబర్ 1న మొట్టమొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారని వెల్లడించారు.

సమాజానికి వృద్ధులు అందించిన సేవలను, అనుభవాలను గుర్తించి గౌరవించాలనీ,
వృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, సామాజిక మరియు ఆర్థిక సమస్యలపై అవగాహన కల్పించడం , వారి వారి హక్కులను కాపాడడం మరియు సమాజంలో వారికి తగిన ప్రాధాన్యత కల్పించడం అందరి లక్ష్యం కావాలన్నారు. 

Medical camp at Shivagayatri Old Age Home under the aegis of the Indian Red Cross Society

Telegram Post – 2026-10-01 15:35:16

Leave a comment

Your email address will not be published. Required fields are marked *