# Tags
#Blog
👁 26 Views

రెడ్‌క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సిరిసిల్ల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

స్వగృహంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన తుంగూర్ సర్పంచ్, గ్రామ ప్రముఖులు

జగిత్యాల:

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం జగిత్యాలలోని సిరిసిల్ల శ్రీనివాస్ స్వగృహానికి విచ్చేసిన బీర్‌పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు, గ్రామ ఉపసర్పంచ్ శీలం లింగన్న, వార్డు సభ్యుడు బండారి తిరుపతి, గ్రామ పెద్దలు అర్షకోట రమేష్ బాబు, బీర్‌పూర్ మండల పాత్రికేయులు ఆడెపు వెంకటేష్, అర్షకోట అరుణ్ కుమార్‌లు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.

అదేవిధంగా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు

చిలుకమర్రి మదన్ మోహన్ (న్యాయవాది), ఎస్పీ సుబ్రహ్మణ్యం (న్యాయవాది), రుద్రంగి గోపాలక్రిష్ణ, నమిలకొండ చందు, మెట్ట కిరణ్ కుమార్‌ తదితరులు సిరిసిల్ల శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వారు, భవిష్యత్తులో ప్రజాసేవా కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల శ్రీనివాస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *