వెంగలాయపేట గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు, పాల్గొన్న జిల్లాకు ఇన్‌చార్జ్, PMO అధికారి శ్రీధర్
జగిత్యాల జిల్లా:
VBG -RAM(G) GP ప్లానింగ్ ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటిని సంబంధిత శాఖల ద్వారా అమలు చేయడంలో భాగంగా జిల్లాకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న PMO అధికారి శ్రీధర్ మరియు స్వచ్ఛ భారత్ మిషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ బుధవారం పెగడపల్లి మండలంలోని వెంగలాయపేట గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యంగా డ్రైన్ల శుభ్రత, సోక్ పిట్ల ఏర్పాటు మరియు నిర్వహణ, అలాగే గ్రామంలో నాలుగు రకాల చెత్తను వేరు చేసి సేకరించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, పారిశుద్ధ్య వ్యర్థాలు మరియు ఇతర ప్రత్యేక వ్యర్థాలను వేర్వేరుగా వేరు చేసి అందించడం ద్వారా గ్రామంలో పరిశుభ్రతను కాపాడుకోవచ్చని వివరించారు. అదేవిధంగా 4 -Segregtion పాంప్లెట్లు, పోస్టర్లను పంపిణీ చేసి స్వచ్ఛత, వ్యర్థాల నిర్వహణ మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామంలో పారిశుద్ధ్య మౌలిక వసతులను మెరుగుపరచడం, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, సోక్ పిట్ల వినియోగాన్ని పెంపొందించడం మరియు నాలుగు రకాల చెత్త వేరు చేసే విధానాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా అమలు చేయడంపై అధికారులు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ZP CEO,DRDO, MPDO, SBM కోఆర్డినేటర్, ECలు, PA, APO మరియు SHG మహిళలు పాల్గొన్నారు.
స్వచ్ఛమైన గ్రామం – ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.