# Tags
#Blog

మెట్‌పల్లి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ మహాధర్నా, ఆర్డీవో కార్యాలయం ఎదుట సమరభేరి

👁 16 Views

జగిత్యాల/మెట్‌పల్లి

మెట్‌పల్లి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట సమరభేరి మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్‌ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకవర్గం, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు.
పట్టణంలోని ప్రతి వార్డులో నాణ్యమైన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న సమీకృత మార్కెట్‌ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. హిందూ శ్మశాన వాటికలను ఆధునీకరించి అవసరమైన వసతులు కల్పించాలన్నారు. పాత బస్టాండ్‌, ఆర్టీసీ డిపో, ఆరపేట ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారి వెంట వర్షపు నీరు నిల్వ ఉండకుండా పక్కా డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని కోరారు. మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలో ప్రత్యేక సుందరీకరణ, విద్యుత్‌ దీపాలంకరణ చేపట్టాలని కోరారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని నవీన్‌ హెచ్చరించారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ అనూప్‌రావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు జుంగుల అనిల్‌గౌడ్‌, బత్తుల జగదీష్‌, కలికోట శ్రీకాంత్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ధర్మపురి స్వరూప, వైస్‌ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్ల ఆనంద్‌, బిజేపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ మహాధర్నా, ఆర్డీవో కార్యాలయం ఎదుట సమరభేరి

Rajagopal Rao, President of the Beerpur Mandal

Leave a comment

Your email address will not be published. Required fields are marked *