# Tags
#Blog

“సేవా సంకల్ప్ అభియాన్‌“ లో భాగంగా రాయికల్ మండలం ఇటిక్యాలలో “అంగన్ మిలన్ సేవ”

👁 13 Views

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో “అంగన్ మిలన్ సేవ” కార్యక్రమం 
నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. 

అనంతరం అంగన్‌వాడీ సిబ్బందిని శాలువాలతో సత్కరించి, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, చిన్నారులకు పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో మాట్లాడి కేంద్రాల్లోని వసతులు, పిల్లలకు అందుతున్న పోషకాహారం, సేవల గురించి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల ద్వారా ప్రతి చిన్నారికి మెరుగైన పోషకాహారం – మెరుగైన బాల్య విద్య – మెరుగైన మౌలిక వసతులు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం “మిషన్ సాక్షం అంగన్‌వాడీ & పోషణ్ 2.0” ద్వారా అంగన్‌వాడీ వ్యవస్థను ఆధునీకరిస్తోంది. ఈ పథకం ద్వారా పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య–పోషకాహార అవగాహన, ఆరోగ్య పరీక్షలు, టీకాలు, అవసరమైన వారికి రిఫరల్ సేవలు అందించబడుతున్నాయి.

ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షులు ఆకుల మహేష్, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, జిల్లా మహిళా మోర్చా కోశాధికారి గొడ్డండ్ల అనితా, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బద్ధం సుజాత , ప్రధాన కార్యదర్శి వట్టిమల్ల శ్రీనివాస్ ,ఏనుగు రవీందర్ రెడ్డి , మండల కార్యదర్శి సుంకిసాల సత్యం, పాక్స్ చైర్మన్ మైపతి రెడ్డి బూత్ అధ్యక్షులు అంజి, రవికిరణ్ ,ఉట్నూర్ నరేష్, గడ్డం సంజీవ్, సాయికుమార్, సీనియర్ నాయకులు కుంట రమేష్ రెడ్డి మరియు గ్రామ సర్పచ్ నిరటి శ్రీనివాస్,కార్యదర్శి రాజేష్,ఆత్మ చైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి, వీడీసీ చైర్మెన్ లింబద్రి గౌడ్ మరియు వార్డు సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

/newoost

Leave a comment

Your email address will not be published. Required fields are marked *