# Tags
#Blog

‘Swachhata Hi Seva’ Special Gram Sabha with V.B.G. Ramji in Porandla Village

👁 18 Views

జగిత్యాల రూరల్ :
జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛత హి సేవా, వి.బి.జి.ఆర్.ఎం. ప్రత్యేక గ్రామసభ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చించారు.
గ్రామాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై గ్రామస్థుల అభిప్రాయాలను తెలుసుకుని, గ్రామసభలో ప్రజలు చురుకుగా పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్యం, తడి–పొడి చెత్త నిర్వహణ, పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి రవిబాబు, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

/newoost

Leave a comment

Your email address will not be published. Required fields are marked *