నిజాయితీగా, బాధ్యతతో విధులు నిర్వర్తించిన జగిత్యాల కొత్త బస్ స్టాండ్ ఆర్టీసీ బృందం – అభినందనలు
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం – భద్రం – క్షేమకరం అనే నినాదంతో నిజాయితీగా, బాధ్యతతో జగిత్యాల కొత్త బస్ స్టాండ్ ఆర్టీసీ బృందం నిరూపించింది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, కాజీపేట కు చెందిన సిరిమల్లె ప్రవీణ్ అనే ప్రయాణీకుడు శుక్రవారం
వరంగల్ బస్ స్టేషన్ నుండి డీలక్స్ బస్సు లో ప్రయాణం చేస్తూ హుజురాబాద్ బస్ స్టేషన్ లో వాష్ రూమ్ కు వెళ్ళాడు. తిరిగి వచ్చేవరకు ఆయన ప్రయాణిస్తున్న డీలక్స్ బస్సు స్టేషన్ నుండివెళ్ళిపోయింది.
ఆ బస్సులోనే తాను ప్రయాణించే బస్ టికెట్ తోపాటుగా
సుమారు 80 వేల రూపాయల విలువచేసే మొబైల్ మరియు మని పర్సు కూడా బస్సులోనే ఉండిపోయింది.
అయితే, ఆ ప్రయాణీకుడి వద్ద టిక్కెట్టు లేనందున డీలక్స్ బస్ ఏ డిపో కూడాతెలియకుండాపోయింది.
అయినప్పటికీ, ప్రవీణ్ అనే ప్రయాణీకుడు హుజురాబాద్ నుండి నిజాంబాద్ వెళ్లే డీలక్స్ బస్ అని, తన వివరాలు జగిత్యాల బస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి వివరించాడు.

ఇక ఆ ప్యాసింజర్ ఫోన్ చేసినప్పటినడి ప్రతి డిపో డీలక్స్ బస్ నుజగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ N రమేష్ అనుమతితో కొత్తబస్టాండ్ లోనున్న ఆర్టీసీ టీం తనిఖీ చేశారు.
చివరి ప్రయత్నంలో నిజమాబాద్ వెళ్లే ఒక డీలక్స్ బస్ లో ఆ ప్రయాణీకుడు చెప్పిన బ్యాగ్, మనీ పర్స్, 80 వేల రూ.ల విలువ చేసే మొబైల్ ఫోన్ దొరికినది.
వెంటనే ఆయనకు కాల్ చేయడంతో , జగిత్యాల కొత్త బస్టాండ్ కు చేరుకున్న ప్రయాణీకుడికి బస్టాండ్ లో ఆర్టీసీ టీం గుర్రం స్వామితో పాటుగా వారి బృందం, అందరి ముందు అందులో ఉన్న వస్తువులు వీడియో తీసి,
80 వేల రూ.ల విలువ చేసే మొబైల్ ఫోన్ మరియు
మని పర్సులో నగదు రూపాయలు, బ్యాగు, అందులో ఉన్న వస్తువులు భద్రంగా, భాద్యతతో, నిజాయితీగా అప్పగించి ఆర్టీసీ నినాదాన్ని నిరూపించారు.
దీంతో, ఆ ప్యాసింజర్ ఆనంద భాష్పాలతో. ..ఇంతటి చక్కటి టీం వర్క్ చేసినందుకు జగిత్యాల కొత్త బస్ స్టేషన్ బృందానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
ఈ సందర్బంగా ప్రయాణీకుడు బస్ లో పోగొట్టుకున్న నగదు సొమ్ము, మొబైల్ ఫోన్ ఇతర వస్తువులను అప్పగించడానికి పడిన శ్రమకు, బాధ్యతతో విధులు నిర్వర్తించినందుకుగాను గుర్రం స్వామి తోపాటుగా జనార్దన్
కొత్త బస్టాండ్ ఆర్టీసీ బృందంకు పేరుపేరునా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





