# Tags
#politics #జగిత్యాల #తెలంగాణ

కాంగ్రెస్ బలపర్చిన ఆర్టీసీ అభ్యర్థులను గెలిపించాలి : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య

👁 13 Views

జగిత్యాల : దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలతో జగిత్యాలలో సందడి నెలకొంది. జగిత్యాల ఆర్టీసీ డిపో పరిధిలో యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగాకొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

మొత్తం ఎనిమిది యూనియన్లు ఎన్నికల బరిలో నిలవగా.. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ బాణం గుర్తుతో పోటీ చేస్తోంది. డిపో పరిధిలో మొత్తం 304 మంది ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగించుకోనున్నారు. ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉండటంతో ఎన్నికలపై కార్మికుల్లో ఆసక్తి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డిపో ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ బలపర్చిన ఆర్టీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య

Leave a comment

Your email address will not be published. Required fields are marked *