# Tags
#Blog

“అభివ్రుద్ది చేస్తూ ఉంటే సీనియర్ నాయకులు వారి స్తాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారు” -ఎమ్మెల్యే సంజయ్ కుమార్

👁 16 Views

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ భూమిపూజ చేసిన సీనియర్ నాయకులు.
దానికి రహదారి లేదు పేపర్ కూడా లేకపోవడం విడ్డూరంగా ఉంది.
కాలని లో డ్రైనేజీ వెళ్ళే పరిస్తితి లేదు.
నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలని స్థల సేకరణ ఒక స్కాం.. స్థలం నిరుపయోగంగా మారింది అని మాజీ ఎంపీ కవిత సహకారం తో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కు భూమిపూజ చేయటం జరిగిందని. జీవన్ రెడ్డి రెచ్చగొట్టే మాటలతో జగిత్యాల అభివ్రుద్ది పనులకు అడ్డం పడుతున్నారని
కేంద్రం gst పెంచడం వల్ల 8 కోట్ల అదనంగా మెడికల్ కాలేజీ పనుల పై భారం పడిందని అన్నారు.
జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గా ఉండి ప్రభుత్వం తో ఉన్న 7 నెలల సమయంలో మెడికల్ కాలేజీ అర్బన్ హౌసింగ్ కాలని పనులు ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం తో కలసి పని చేస్తున్న…అవసరం అయితే సభ్యత్వం తీసుకుంటా..
మెడికల్ కాలేజీ కి పాత బకాయిలు 40 కోట్లు మంజూరు చేయటం జరిగింది.
నలువైపులా డబల్ రోడ్డు మంజూరు చేసి పనులు కూడా జరుగుతున్నాయి.
సంజయ్ కుమార్ జీవితం జగిత్యాల ప్రజలకు తెరచిన పుస్తకం. అని చెప్పారు, నాకు పేరు వస్తుందనే అనవసర ఆరోపణలు. రోల్లవాగు ప్రాజెక్ట్ అటవీ అనుమతుల కారణంగా
ఆలస్యం అవుతున్నాయి. ముంపు కు గురవుతున్న అటవీ భూమి 827 ఎకరాలకు రెవెన్యూ భూమి ఇవ్వడం ద్వారా అటవీ అనుమతుల ప్రక్రియ ప్రారంభం అయింది. అటవీ శాఖ కు ఇంకా కొంత రెవెన్యూ భూమి కోసం సర్వే కూడా అవుతుంది. మెడికల్ కాలేజీ పనులు కొంత అలస్యం అయ్యాయిం
వైద్య విద్యార్థులు వారి ఆవేదన నిరసన తెలిపారు. నేను కలెక్టర్ వెళ్ళి మాట్లాడగా వారు మాకు సన్మానం చేశారు .త్వరలోనే పనులు పూర్తి చేస్తాం..ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.
200 కోట్ల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
వేజ్ నాన్ వెజ్ మార్కెట్ త్వరలోనే ప్రారంభిస్తాం..అభివ్రుద్ది కి అడ్డం పడాలని అజెండా పెట్టుకొని విమర్శ..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ ఛైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభూషణం బండ శంకర్ కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దుమల రాజ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుసరి అనిల్ సభ్యులు కత్రోజ్ గిరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రాజేష్ కాంగ్రెస్ సేవాదళ్ స్టేట్ సెక్రటరీ ముకేష్ ఖన్నా టౌన్ యూత్ అధ్యక్షులు దయల శరత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Btntht

Leave a comment

Your email address will not be published. Required fields are marked *