# Tags
#Events #People #జగిత్యాల #తెలంగాణ

మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికి రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం

👁 7 Views

మెట్‌పల్లి:

విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహణ

విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి నిర్వహణలో మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బందికి సీపీఆర్ (CPR) పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సీపీఆర్ నిర్వహణ నేర్చుకోవాలని, అత్యవసర వైద్య పరిస్థితుల్లో, ప్రధానంగా గుండె ఆగిపోయినప్పుడు సకాలంలో సీపీఆర్ చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

వైద్య సహాయం అందేలోపు సీపీఆర్ చేయడం బాధితుల ప్రాణాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

సీపీఆర్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రెడ్‌క్రాస్ సొసైటీ, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు, కళాశాలల్లో కూడా సీపీఆర్ అవగాహన శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే నైపుణ్యాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని వివరించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కోశాధికారి పూదరి నరేందర్ గౌడ్, మేనేజింగ్ కమిటీ సభ్యులు కందుకూరి కృష్ణారెడ్డి, చిట్ల రాజ మనోహర్ రెడ్డి, మచ్చ నారాయణ, తుమ్మనపల్లి సత్యనారాయణ, చిత్తారి మధుకర్, సిరిపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ హరి కార్యక్రమంలో పాల్గొన్నారు.