# Tags
#Culture #Events #జగిత్యాల #తెలంగాణ

జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు-ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్ సత్యప్రసాద్

👁 10 Views

ఆడబిడ్డల ఆత్మగౌరవం,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

•బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్


జగిత్యాల :

బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.

కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటుగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ, మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి డా. ఆడెపు భాస్కర్, మహిళా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది సంబురంగా బతుకమ్మ పాటలు పాడుతూ, పాల్గొన్నారు.

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు.మహిళలు సమిష్టిగా బతుకమ్మ ఆడటం వల్ల సాంఘీక ఐక్యత బలపడుతుందని తెలిపారు.

తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేకమైన పేర్లతో బతుకమ్మ పండగ మహిళలు నిర్వహిస్తారని, బుధవారం ఐదవ రోజు అట్ల బతుకమ్మ – అట్లు (దోశెలు) బతుకమ్మ – కాగా ప్రకృతి ప్రసాదించిన తంగేడు, గునగ, బంతి మరియు రంగు రంగుల పూలతో బతుకమ్మను అలంకరించి మహిళలు ఆట,పాటలతో పండుగ చేసుకోవడం నిజంగా కన్నులపండుగలా ఉందని
ఈ వేడుకల్లో పాల్గొనడం అనందంగా ఉందనీ, అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా అధికారులు,సిబ్బంది ఉత్సాహకంగా బతుకమ్మ పాటలు పడుతూ బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు..

మహిళలు బతుకమ్మ నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు, వాగుల వద్ద జాగ్రత్త వహించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లు చేసినట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *