# Tags
#Candidates #Events #politics #జగిత్యాల #తెలంగాణ

మంత్రుల హామితో సమ్మె విరమించిన జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

👁 7 Views

జగిత్యాల జిల్లా..

మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హామితో సమ్మె విరమించిన జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు…

గత 2 రోజులుగా తరగతులు బహిష్కరించి వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

వసతి గృహం, తరగతి గదులు, మౌళిక సదుపాయాలపై ఇబ్బందులపై విద్యార్థులు ఆందోళన చేశారు.

డిసెంబర్‌ 15 నాటికి మెడికల్‌ కాలేజీ భవనం, హాస్టల్‌ భవనాలు, ప్లేగ్రౌండ్‌, మెస్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రుల హామి ఇచ్చారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆర్‌ & బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడారు.

మంత్రుల హామితో మెడికల్‌ విద్యార్థులు, వైద్యులు సంతృప్తి వ్యక్తం చేసి, సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.