# Tags
#Events #జగిత్యాల #తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తుచర్యలు : ఎస్ ఐ శ్రీకాంత్‌

👁 8 Views

బుగ్గారం :(జగిత్యాల జిల్లా):

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బుగ్గారం మండల కేంద్రంలోని ఎక్స్‌ రోడ్‌ వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను స్థానిక ఎస్సై శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో తొలగించారు.


ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా చెట్ల కొమ్మలను తొలగించినట్లు తెలిపారు.

బుగ్గారం ఎక్స్‌రోడ్‌ వద్ద చెట్లు, పొదల కారణంగా బస్‌స్టాప్‌ కనిపించకుండా ఉండటంతో పాటు, మూలమలుపు వద్ద పిచ్చి మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు.

ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్‌, బుగ్గారం గ్రామ సర్పంచ్‌ నక్క రాజవ్వ–రాజయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.