ఆలయాల సందర్శన – పుష్కర ఏర్పాట్లపై సమీక్ష – ఆత్మీయుల కలయికలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రిప్రగడ హనుమంతరావు
జగిత్యాల : (వేములవాడ, కొండగట్టు, ధర్మపురి) :
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రిప్రగడ హనుమంతరావు దంపతులు శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు పవిత్ర పుణ్య క్షేత్రాలను సందర్శించారు.

ముందుగా,
👉 వేములవాడలో :
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శ్రీ భీమేశ్వర ఆలయంలో ఆయా స్వామి వారలను సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయఅధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలీ వేదం పండితులు స్వామి వారల ప్రసాదమును, శేషవస్త్రమును అందజేసి, ఆశీర్వదించారు. అనంతరం ఆలయం అభివృద్ధి పనులపై చర్చించి, నాణ్యతతో పాటుగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
👉 అనంతరం,
కొండగట్టులో :
శ్రీ ఆంజనేయస్వామి వారిని సతీసమేతంగా దర్శించుకుని, రానున్న పుష్కరల్ సందర్బంగా, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం వస్తారని, ఈ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని మీడియకు వివరించారు.
👉 తర్వాత,
ధర్మపురిలో శ్రీ లక్ష్మి నృసింహస్వామి వారిని సతీమణితో కలిసి దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలనంతరం, వచ్చే గోదావరి పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరితగతిన పనులుపూర్తి చేయాలనిఆదేశించారు.

👉 అనంతరం,
తిరుగు ప్రయాణములో జగిత్యాలజిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు, ఆత్మీయులు సిరిసిల్ల శ్రీనివాస్ స్వగృహంకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తన సతీమణి శ్రీమతి స్రవంతి తో కలిసి చేరుకొని, ఆదివారం నుండి ప్రారంభంకానున్న శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ పూజా కార్యక్రమాల నేపథ్యంలో, అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రతీ ఏటా శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ పూజా కార్యక్రమాలను పురస్కరించుకుని, అమ్మవారిని దర్శించుకుంటామని ఈ సందర్భంగా వివరించారు.

Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





