# Tags
#Blog

ఎల్నినో కరువు ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్నీ విధాలుగా సిద్ధంగా ఉంది..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

👁 7 Views

జగిత్యాల : రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి.. అన్నారు
జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..ఎల్నినో ప్రభావం వల్ల సరియగు వర్షాలు పడక కొంచెం ఇబ్బంది ఉంది..రైతంగం ప్రత్యామ్నాయ పంటలు వేయాలి..జగిత్యాల పెద్దపల్లి మంథని ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకునే పరిస్థితి ఉంది..
ఎస్ ఆర్ ఎస్ పి లో నీటి మట్టం చాలా తక్కువ ఉంది..ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్, డి ఇ రమేష్ ఈరోజు నీటిని విడుదల చేశారు..జగిత్యాల 90 శాతం వ్యవసాయం ఆధారం..రొళ్ల వాగు ప్రాజెక్ట్ లైనింగ్ ఎమ్మెల్యే సంజయ్ బాగు చేయించారు..ఇలాంటి సందర్భం లో ప్రజల పక్షాన నిలవడం ప్రభుత్వం భాద్యత..అత్యంత తీవ్రమైన కరువు ఎదురుకునే పరిస్థితి ఉంది..
12 వ తేదీ నాడు ప్రత్యేక మంత్రి వర్గ సమావేశం ఉంది..వరి కాకుండా ఇతర పంటలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము..విపత్కర పరిస్థితి లో మీడియా సహకారం వెల కట్టలేనిది..
కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీళ్లు రాకున్నా అత్యధిక శాతం పంటలు పండినాయి..
ఎదో విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడమే బి ఆర్ ఎస్ ఉద్దేశ్యం అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *