# Tags
#Blog

వృద్ధాశ్రమానికి విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల విరాళం రూ.50 వేలు అందజేత

👁 19 Views

జగిత్యాల :

జగిత్యాల విశ్వకర్మ సంక్షేమ సంఘం టిఆర్ నగర్ లో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి రూ.50వేల విరాళంను ఉమ్మడి కరీంనగర్ జిల్లా విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల సంఘం
శుక్రవారం చెక్కు ద్వారా నిర్వాహకులకు అందజేశారు. అలాగే, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ల సంఘం కార్యదర్శి కే. లక్ష్మయ్య మాట్లాడుతూ… 22 సంవత్సరాల నుండి ప్రతీ ఏటా అనాథలకు, వృద్ధులకు రూ. 8 లక్షలు సహాయం అందించామని, ఇంకా 12 లక్షల బ్యాంకు డిపాజిట్లు నిర్వహిస్తూ భవిష్యత్ అవసరాలకు నిల్వ ఉంచామని తెలిపారు.

సంఘ అధ్యక్షులు, ఎన్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్ పి.గణపతి మాట్లాడుతూ…అత్యవసర సమయాల్లో సంప్రదిస్తే అనాథల సంక్షేమం కొరకు మరిన్ని విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్కో సంస్థ జిల్లా మేనేజర్ డురిశెట్టి మనోహర్, ఏడీఈ వరుణ్ కుమార్, ఏఈలు సుందర్, అశోక్ రెడ్డి, విశ్రాంత ఇంజనీర్లు ఆనందరావు, గోపాలరెడ్డి, సదాశివరెడ్డి, గణేష్, వృద్ధాశ్రమం నిర్వాహకులు టీవీ సూర్యం, ముమ్మాడి నాగభూషణo బెజ్జెంకి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *