# Tags
#Blog

బిజెపి కార్మిక సెల్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

👁 14 Views

భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ కట్ట విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక భద్రత కార్యక్రమం కింద వికలాంగుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్మిక విభాగం కన్వీనర్ కట్ట విజయ్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులుగా గుర్తించేందుకు గతంలో 80% ఉన్న వైకల్యాన్ని 40 శాతం వరకు తగ్గించి వారికి జాతీయ భద్రతా కార్యక్రమం కింద ఆర్థిక సాయం అందజేసేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. కుల,మత, ప్రాంత, పేద ధనిక అనే తేడా లేకుండా పుట్టినప్పటి నుండి ప్రతి వికలాంగులకి ఈ పథకాన్ని వర్తింప చేయడాన్ని ఆయన స్వాగతించారు. 2030 -31 వరకు ఐదేళ్లపాటు వికలాంగుల సంక్షేమ పథకాల అమలు కోసం రూ.53,428 కోట్ల బడ్జెట్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు. ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వాలలో సంక్షేమ పథకాలు కేవలం కాకితాల వరకే పరిమితం అయ్యాయని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అట్టడుగు వ్యక్తి వరకు అందే విధంగా వాటిని చిత్త శుద్ధితో అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్మిక విభాగం నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *