# Tags
#Events #జగిత్యాల #తెలంగాణ

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ఎన్. ప్రసూనాంబ బాధ్యతల స్వీకరణ

👁 9 Views


జగిత్యాల :

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ఎన్. ప్రసూనాంబ బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో బాధ్యతలు స్వీకరించారు.

సాధారణ బదిలీల్లో భాగంగా జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయంలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహించారు.

అక్కడి నుంచి బదిలీ పై జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమితులై బుధవారం బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కే.వై. ప్రసాద్ కలెక్టరేట్ ఏవో కిషన్ మరియు కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్చములు అందించి, స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు.