# Tags
#జగిత్యాల #తెలంగాణ

కోటి లింగాలలో పుష్కరాల అభివృద్ధి పనులు, ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

👁 6 Views

2027 గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి


జగిత్యాల,

రానున్న 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో చేపడుతున్న గోదావరి పుష్కరాల అభివృద్ధి మరియు ఆలయ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కోటిలింగాల ప్రాంతంలో పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన సౌకర్యాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

పుష్కరాల నిర్వహణకు అవసరమైన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, ఆలయ నిర్మాణ పనులను కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. పుష్కరాలకు ముందుగానే అన్ని పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, టెంపుల్ ఈ.ఈ. రాజేష్, మండల తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.