# Tags
#Events #జగిత్యాల #తెలంగాణ

బిజెపి ఆధ్వర్యంలో జగిత్యాల అంగన్వాడి కేంద్రంలో పండ్ల పంపిణీ

👁 11 Views

బిజెపి పట్టణ కార్యదర్శి గడ్డల లక్ష్మి ఆధ్వర్యంలో 12వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అంగన్ మిలన్ సేవా” కార్యక్రమంలో భాగంగా 12వ వార్డు అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్లను సన్మానించి పండ్ల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకురాలు గడ్డల లక్ష్మి మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు అంగన్వాడీ కేంద్రాల్లో మాత శిశు సంక్షేమం కోసం కృషి చేస్తున్న అంగన్వాడి ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందని తెలిపారు.

మహిళా శిశు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా అంగన్వాడి కేంద్రాలలో లబ్ధిదారులైన గర్భవతులు, బాలింతలు, పిల్లల కోసం పౌష్టికాహారాన్ని అందిస్తుందని వివరించారు.

అంగన్వాడి సేవలను బలోపేతం చేయడం తో పాటు పారదర్శక సేవలను అందించడం కోసం అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ల ను అందించడం జరిగిందన్నారు.

ప్రతి ఒక్కరు అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి టీచర్ శ్యామల, ఆశా కార్యకర్త ను ఘనంగా సన్మానించి చిన్నారులకు పండ్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శ్యామల, ఆశ వర్కర్ అంజలి, అమల గంగు తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *