# Tags
#Events #జగిత్యాల #తెలంగాణ

SC స్టడీ సర్కిల్ లో హార్ట్‌ఫుల్‌నెస్ వ్యాస రచన పోటీ విజేతలకు బహుమతి పుస్తకాల ప్రదానం & నేత్రదాన ప్రతిజ్ఞ

👁 21 Views

జగిత్యాల :

రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ – ఇస్కా (ISKA) ఫౌండేషన్ – హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సెంటర్, జగిత్యాల మరియు  AAPI ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని స్టడీ సర్కిల్ ఆవరణలో హార్ట్‌ఫుల్‌నెస్ వ్యాస రచన పోటీ విజేతలకు బహుమతి పుస్తకాల ప్రదానం & విద్యార్థులు, సిబ్బందిచే నేత్రదాన ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత, కార్యక్రమం నిర్వాహకులు మంచాల కృష్ణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామకృష్ణ, ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఏవి ఎల్ ఎన్ చారి కార్యదర్శి ఎన్ రాజు పూర్వ అధ్యక్షులు ఆంటోనీ ముత్తు మరియు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జయరాజ్ మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ చంద్రయ్య మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అతను మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు.

ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఐదు నెలల కాలంలో పొందిన శిక్షణ క్రమశిక్షణ మరియు వివిధ అంశాలలో నేర్పరితనం చల్చర అంశాలను పూర్తిగా అవగాహన చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు పొందాలని అన్నారు.

అంతేకాకుండా సమాజం మనకేమిచ్చిందని కాకుండా సమాజానికి మేమేం ఇవ్వగలం అన్న ఆలోచనతో ముందుకు సాగాలన్నారు.

అలాగే విధి నిర్వహణలో అంకితభావంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, తమ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినుండి సమస్యలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వారి వారి సమస్యలను పరిష్కరించినప్పుడే ఉద్యోగానికి సార్థకత ఏర్పడుతుందని, అంతేకాకుండా ఒక మంచి భవిష్యత్తును ఏర్పరచుకోగలుగుతామని రెవెన్యూ అదనపు కలెక్టర్ బిఎస్ లత విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.

 అనంతరం, హార్ట్‌ఫుల్‌నెస్ వ్యాస రచన పోటీ విజేతలకు బహుమతి పుస్తకాల ప్రదానంతోపాటుగా విద్యార్థులు, అధ్యాపకులచే “జల ప్రతిజ్ఞ, నేత్రదాన ప్రతిజ్ఞ” చేయించారు.

 ఈ కార్యక్రమాల అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులు 5 నెలల శిక్షణ పూర్తి చేసుకుని వెళుతున్న సందర్భంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకుని, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకున్నారు 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *