# Tags
#Blog

జిల్లాను బాల్య వివాహరహిత మరియు పోక్సో (POCSO) కేసుల్లేని జిల్లాగా మార్చడమే లక్ష్యం: అదనపు కలెక్టర్ రాజాగౌడ్

👁 57 Views

జగిత్యాల :

జిల్లా సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగాల ఆధ్వర్యంలో, జిల్లా సంక్షేమ అధికారి ఆడేపు భాస్కర్ ఆద్వర్యంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అధ్యక్షతన బాల్య వివాహాల నిరోధన మరియు పోక్సో (POCSO) కేసుల నివారణకై జిల్లా స్థాయి వార్షిక కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం జరిగింది.

అదనపు కలెక్టర్ రాజా గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశానుసారం, మిషన్ వాత్సల్య కింద 2026-27 సంవత్సరానికి గాను బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 మరియు పోక్సో చట్టం-2012 ను పటిష్టంగా అమలు చేయడానికి ఈ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను రూపొందించారు.

ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రతి మండలంలో మరియు అన్ని గ్రామాలలో నెలవారీ ప్రాతిపదికన పకడ్బందీగా అమలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

అన్ని జిల్లా స్థాయి అధికారుల మరియు ప్రభుత్వ శాఖల సమన్వయంతో (విద్యాశాఖ, పంచాయతీ రాజ్, రెవెన్యూ, పోలీసు మరియు ఆరోగ్య శాఖలు) కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సమష్టి కృషితో జిల్లాను పూర్తిగా “బాల్య వివాహరహిత జిల్లాగా” మరియు “పోక్సో కేసులు లేని జిల్లాగా” అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.

“బాల్య వివాహం – బతుకు ఆగం” పేరుతో పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించడం, గ్రామ బాలల పరిరక్షణ కమిటీల (VCPCs) ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం వంటివి ఈ కార్యాచరణ

👉🏾ప్రణాళికలో ముఖ్యమైన అంశాలు.
ఈ విశేష కార్యక్రమానికి జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ , కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, జిల్లా ఆరోగ్య శాఖా అధికారి Dr. సుజాత, CDPO లు వేరలక్ష్మి, జయ ప్రద, వాణిశ్రీ మరియు పద్మ, డీసీపీఓ (DCPO) సురేష్, విద్యాశాఖ కో ఆర్దినటర్ మహేష్ మరియు అలాగే జిల్లా సంక్షేమ సమితి సభ్యులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా సాధికారత విభాగం, సఖి (Sakhi) విభాగం, భరోసా కేంద్ర అధికారులు మరియు ఎన్జీవో (NGO) ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *