# Tags
#Blog

స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ అవగాహన కార్యక్రమాలు

👁 10 Views

కోరుట్ల :

కోరుట్ల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమం

కోరుట్ల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు “వేస్ట్ టు వెల్త్”, వ్యర్థ పదార్థాలను ఉపయోగించి పునర్వినియోగ వస్తువుల తయారీ, అలాగే నాలుగు రకాల వ్యర్థాల వేరు చేయడం (Four-Way Waste Segregation) పై అవగాహన కల్పించారు. వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి, పునర్వినియోగం ద్వారా విలువైన వస్తువులను తయారు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణకు కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

అనంతరం నాలుగు రకాల వ్యర్థాల వేరు చేయడం మరియు వ్యర్థాల నిర్వహణపై క్విజ్ పోటీ నిర్వహించారు. పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్వచ్ఛత – ప్రతి ఒక్కరి బాధ్యత, వ్యర్థాల వేరు చేయడం – మనందరి బాధ్యత.

స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ అవగాహన కార్యక్రమాలు

🕉️ పంచాంగము 25.09.2026

Leave a comment

Your email address will not be published. Required fields are marked *