ఏసిబి వలలో వేములవాడ రూరల్ తహసీల్దార్, ‘భూభారతి’ ఆపరేటర్
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంనకు చెందిన తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్ మరియు ఒక ప్రైవేటు వ్యక్తి, ‘భూభారతి‘ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు చిక్కారు.
‘రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఎండి. అబూబకర్ , ఫిర్యాదుదారుని నుండి రూ. 8,000/- లంచం డిమాండ్ చేసి, మరొక వ్యక్తి ద్వారా ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా కరీంనగర్ పరిధికి చెందిన ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు.

వేములవాడ రూరల్ కార్యాలయానికి చెందిన ‘భూ భారతి’ ఆపరేటర్ (ప్రైవేట్ వ్యక్తి) సంకసాల అనిల్ కుమార్, ఫిర్యాదుదారుని అత్తకు చెందిన వ్యవసాయ భూమిని, ఫిర్యాదుదారుని తండ్రి పేరు మీద గిఫ్ట్ డీడ్ (బహుమతి పత్రం) ద్వారా రిజిస్ట్రేషన్ చేయించేందుకు సహకరించే నిమిత్తం లంచం తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుండి లంచం సొమ్ము రూ. 8,000/-ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొదటి నిందితుడు తన విధులను అక్రమంగా, నిజాయితీ లేకుండా నిర్వహించి, అక్రమ లబ్ధిని పొందాలని ప్రయత్నించారని ఏసిబి అధికారులు పేర్కొన్నారు.
దీంతో, ఇద్దరు నిందితులను కరీంనగర్‌లోని ఎస్‌పిఇ (SPE) & ఏసిబి (ACB) కేసుల ప్రత్యేక న్యాయస్థానం (Principal Special Judge) ముందు జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరుపరుస్తున్నామని వెల్లడించారు.
సెల్ ఫోన్ నంబర్ – 1064 (టోల్ ఫ్రీ నంబర్):
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రజలు ఏసిబి (ACB) టోల్ ఫ్రీ నంబర్ ‘1064’ని సంప్రదించవచ్చు. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), మరియు ఎక్స్ (X/గతంలో ట్విట్టర్ – @Telangana ACB) వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా తెలంగాణ ఏసిబిని సంప్రదించవచ్చు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏసిబికి సంబంధించిన క్యూఆర్ కోడ్ (QR Code) అందుబాటులో ఉంది. ఫిర్యాదుదారుని పేరు మరియు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు వివరించారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





