# Tags
#Events #People #తెలంగాణ

ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం ప్రారంభం

👁 18 Views

జగిత్యాల :

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జగిత్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో జగిత్యాల IMA భవన్ లో “డొనేట్ బ్లడ్ – సేవ్ లైవ్స్” కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 25వ రక్తదాన శిబిరాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రక్తదానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, ప్రసూతి, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఇతర సమయాల్లో ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిరంతరం శిబిరాలు నిర్వహిస్తున్న ఐఎంఏ ప్రతినిధులను అభినందించారు.మానవ సేవ మాధవ సేవ అందరూ భావించాలి అన్నారు..

ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO డా. ఎన్.శ్రీనివాస్,ఐఎంఏ సెక్రటరీ డా.అకుతోట శ్రీనివాసరెడ్డి, కోశాధికారి డా.సుధీర్, కౌన్సిలర్ ప్రశాంత్ రావు, డా.నాగరాజు, డా.శంకర్, డా.కృష్ణ మూర్తి, విమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ , వైద్యులు, నాయకులు, ఐఎంఏ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *